గంజాయి నియంత్రణకు పోలీసుల ప్రత్యేక తనిఖీలు

సాలూరులో మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పట్టణ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో బంగారమ్మ కాలనీలో శనివారం కార్డన్ సెర్చ్ నిర్వహించి, 25 వాహనాలను పరిశీలించి అనుమానాస్పద అంశాలపై ఆరా తీశారు. గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాల నియంత్రణలో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కాలనీవాసులకు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, ర్యాలీ నిర్వహించి, నిర్మూలనకు సహకరించాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమాన్ని డ్రోన్ సర్వైలెన్స్, వీడియోగ్రఫీ ద్వారా నమోదు చేశారు. పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్