పంచముఖేశ్వర స్వామి ఆలయంలో శ్రీ రుద్ర యాగం ప్రారంభం

సాలూరు శ్రీ బాలాత్రిపుర, పంచముఖేశ్వరస్వామి వారి ఆలయంలో 30-11-2025 నుండి 06-12-2025 వరకు సైవాగమం ప్రకారం "శ్రీ రుద్ర యాగం" జరుగుతోంది. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలతో విరాజిల్లుతున్న పంచభూతాత్మకుడైన పంచముఖేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య శర్మ (సుబ్బు గురువు) ఆధ్వర్యంలో ఈ యాగం నిర్వహిస్తున్నారు. గురువారం నాడు సహస్ర కలశాలతో శివునికి అభిషేకాలు, దశ సహస్ర రుద్రాక్షలతో శివలింగార్చన, శ్రీ రుద్ర యాగం జరిగాయి. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్