అంగన్వాడీ పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం

రాష్ట్రంలో అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 5 వేల అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. తొలి విడతలో 2600 పోస్టులను భర్తీ చేస్తామని ఆమె చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా మార్పు చేసినట్లు వెల్లడించారు. అనంతరం మంత్రి పార్వతీపురంలోని వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి స్వామి దర్శనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్