మక్కువ మండలంలోని కోన గ్రామం రహదారిలో జరిగిన ప్రమాదంలో జట్ల ఉదయ్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. భూతాడ కర్రీవలసకు చెందిన ఉదయ్ కుమార్ గోడాయివలసకు వెళ్తుండగా శాంతి స్వరం ఆలయం సమీపంలో వాహనం అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని ఉపాధి కూలీలు గుర్తించి మక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సాలూరు, ఆపై విజయనగరం ఆసుపత్రికి తరలించారు.