మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 9 కమిటీల ఏర్పాటు

శృంగవరపుకోట మండలం పెద్దఖండేపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2.0లో భాగంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. గ్రామ ప్రజలను ఏకం చేస్తూ, 80 మందికి పైగా సభ్యులతో 9 కమిటీలను శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలు చురుకుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం ఆనందదాయకమని కడుబండి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సాంబమూర్తి రాజు, వాకాడ రాంబాబు, పినిశెట్టి వెంకటరమణ, పెనగంటి రవి, మేరపురెడ్డి చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్