శృంగవరపుకోట సీఐ నారాయణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం, రేవళ్లపాలెం కూడలిలో ట్రాక్టర్ తొట్టె, ట్యాంకర్ చోరీ కేసులో ఎర్రినాయుడును పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 23న జరిగిన ఈ చోరీపై ఎస్. కన్నారావు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో గింజేరు గ్రామానికి చెందిన ఎర్రినాయుడు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించి, ఎస్సై చంద్రశేఖర్ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై గతంలో ఏడు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన తొట్టెలు, ట్యాంకర్లను స్వాధీనం చేసుకుని, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.