పీడీ యాక్ట్ కింద నిందితుడి నిర్బంధం

శృంగవరపుకోట మండలం తెన్నుబొడ్డవర గ్రామానికి చెందిన మద్దాల వంశీపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు జిల్లా ఎస్పీ ఏ. ఆర్. దామోదర్ తెలిపారు. ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. పీడీ యాక్ట్ ప్రకారం నిందితుడిని ఏడాది పాటు నిర్బంధించే అవకాశం ఉందని, మద్దాల వంశీని అదుపులోకి తీసుకుని విశాఖపట్నం కేంద్ర కారాగారానికి తరలించినట్లు వెల్లడించారు. నేరాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు కొనసాగుతాయని ఎస్పీ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్