అలమండ: తలపై అగ్గిని మోస్తూ కోలాటం

జామి మండలం అలమండ గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి జాతర నేపథ్యంలో బుధవారం పొలిమేర నుంచి దేవుని గద్దెకు అమ్మవారిని తీసుకొని వెళ్లారు. అమ్మవారిని ఘటాల నడుమ గ్రామ పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు తలపై బిందెలతో అగ్గిని మోస్తూ కోలాటం ఆడారు. ఇది చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. 9 రోజుల పాటు అమ్మవారి ఘటాల ఊరేగింపు కొనసాగుతుందని కమిటీ తెలిపింది. 8, 9 తేదీల్లో జాతర జరగనుంది.

సంబంధిత పోస్ట్