ప్రజారోగ్య పరిరక్షణే కూటమి తొలి ప్రాధాన్యమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. శనివారం ఎల్.కోట టీడీపీ కార్యాలయంలో జరిగిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన 15 మంది లబ్ధిదారులకు రూ.11,09,363 విలువైన చెక్కులు అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు వరంగా మారిందని, ఆర్థికంగా ఇబ్బంది పడే కుటుంబాలకు ఇది భరోసా కల్పిస్తోందని పేర్కొన్నారు.