ఈ విద్యా సంవత్సరానికి వంగర కేజీబీవీ గురుకులంలో ప్రవేశాల కోసం దరఖాస్తుల స్వీకరణ రేపటితో ముగియనుంది. ప్రిన్సిపల్ రోహిణి గురువారం ఈ విషయాన్ని తెలిపారు. 6వ తరగతిలో 40 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌కు 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు 6వ తరగతికి 122, ఇంటర్‌కు 89 దరఖాస్తులు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. ఆసక్తి గలవారు విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, ఫోటోలు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.