శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులతో వైద్యం చేయించుకుంటున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తోందని తెలిపారు. సోమవారం ఎల్. కోట క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, ఆపదలో ఉన్న అర్హులందరికీ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.