విద్యా రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండలం రంగాపురంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో విద్యార్థులకు ఆమె రూ. 1, 30, 000 తో 100 పరుపులు ఆదివారం అందజేశారు. డబ్బు, ఆస్తి శాశ్వతం కాదని, విద్యే శాశ్వతమని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాకారానికి కృషి చేయాలని కోరారు. పాఠశాల సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.