కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేంతవరకు పోరాటం సాగిస్తామని మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎల్ కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద సోమవారం ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన మండల వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. వైసీపీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు పాల్గొన్నారు.