మొంథా తుఫాన్ ప్రభావంతో శృంగవరపుకోట పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతట్టు, కొండవాలు ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. కొన్ని ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రమాదకర స్థితిలో ఉన్న ఇళ్లలోని వారిని పోలీసులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షపు నీటిలోకి వెళ్లవద్దని సూచనలు జారీ చేశారు. అధికారులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.