ఎల్ కోట: అశోక్ గజపతిరాజును గవర్నర్ గా నియమించడం గర్వకారణం

మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును గోవా రాష్ట్ర గవర్నర్ గా రాష్ట్రపతి నియమించడం రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణమని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విలువలకు, హుందాతనానికి అశోక్ గజపతిరాజు మారుపేరు అని కొనియాడారు. ఈయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని ఆకాంక్షిస్తూ, తన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్