ఈనెల 14 న ఎల్ కోట మండలం గోల్డ్ స్టార్ జంక్షన్ వద్ద శ్రీ వెంకట సాయి కళ్యాణ మండపంలో ఎల్ కోట మండల వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీపీ, రాష్ట్ర వైసీపీ పంచాయతీరాజ్ విభాగం కమిటీ ప్రధాన కార్యదర్శి గేదెల శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశానికి మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు తెలిపారు. వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.