లక్కవరపుకోట: రోడ్డు ప్రమాదం..ఇద్దరికి గాయాలు

లక్కవరపుకోట మండలం భీమాలి గ్రామం సమీపంలో గురువారం బైక్, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న దుగ్గిరాల రవణమ్మ, వెంకటరమణలకు తీవ్ర గాయాలయ్యాయి. రవణమ్మకు ఎడమ కాలు, ఎడమ చేయి విరగగా, వెంకటరమణకు రెండు కాళ్లు విరిగిపోయాయని స్థానికులు తెలిపారు. వీరిద్దరినీ మెరుగైన చికిత్స కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్