దోమల నివారణకు, అంటువ్యాధుల నివారణకు చర్యలు: అధికారి శ్రీనివాసరావు

వియ్యంపేట పరిధిలోని తుమ్మికాపల్లి గేట్ ఏరియాలో దోమల నివారణ, అంటువ్యాధుల ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారి శ్రీనివాసరావు అధికారులతో కలిసి పర్యటించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమల లార్వా పెరగకుండా చర్యలు తీసుకోవాలని, నీటి కుండీలు, కూలర్లలో నీరు నిల్వ లేకుండా చూడాలని సూచించారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు రాకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటినే తాగాలని, ఆహార పదార్థాలను నిల్వ ఉంచవద్దని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్