కొత్తవలస మండలం చీపురువలస కు చెందిన వైసిపి నాయకులు బోనుగు రామకృష్ణ తండ్రి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ కోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు శనివారం రామకృష్ణ కుటుంబాన్ని స్థానిక వైసీపీ శ్రేణులతో కలిసి పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి వ్యక్త పరిచారు. పార్టీ తరపున అండగా ఉంటానని హామీ ఇచ్చారు. పి ఎ సి ఎస్ మాజీ అధ్యక్షులు గొరపల్లి శివ తదితరులు పాల్గొన్నారు.