కొత్తవలస: వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులుగా కండ్రెడ్డి

వైసీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులుగా కొత్తవలస మండలం ఎర్రవాని పాలెం గ్రామానికి చెందిన కండ్రెడ్డి రామన్న పాత్రుడు నియమితులయ్యారు. ఇందుకు సంబంధించి వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నుండి ఆదివారం ఉత్తర్వులు అందినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు మండలంలోని వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈయన విశాఖ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులుగా సేవలందించారు. బీసీల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన అన్నారు

సంబంధిత పోస్ట్