రేపు ఆ మండలాల్లో పవర్ కట్

సంతకవిటి మండలం గుల్ల సీతారామపురం 33/11KV సబ్‌స్టేషన్ పరిధిలో నిర్వహణ పనుల కారణంగా శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గుల్ల సీతారామపురం పరిధిలోని 11 గ్రామాలు, రేగిడి మండలంలోని 10 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. పనులు పూర్తయిన వెంటనే విద్యుత్ పునరుద్ధరిస్తామని, వినియోగదారులు సహకరించాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్