రైతులకు భూ హక్కుల పత్రాల అందజేత

శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి గురువారం ఎస్‌కోట మండలం ఆలుగుబిల్లిలో 765 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు అందజేశారు. అర్హులైన ప్రతి రైతుకు చట్టబద్ధమైన హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆమె తెలిపారు. భూ రికార్డుల సక్రమ నిర్వహణతో రైతులకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని, నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్