జామి మండలంలో వర్షం

జామి మండలంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు కమ్ముకొని, ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తూ వర్షం కురిసింది. ఎండకు అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. వరి ఆకుమడులు సిద్ధం చేసిన రైతులు వర్షానికి హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్