శృంగవరపుకోట మండల కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతోంది. ఆదివారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి ప్రధాన రహదారంతా జలమయం అయ్యింది. దీంతో వాహన దారులతో పాటు కాలినడకన ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులకు లోనయ్యారు. రోడ్డు ప్రక్కనే వ్యాపారం నిర్వహిస్తున్న చిరు వ్యాపారుల సైతం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని నీరు నిల్వ లేకుండా చేయాలని కోరుతున్నారు.