ఎస్. కోట నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ వబ్బిన సత్యనారాయణ పై కొంతమంది జనసేన కార్యకర్తలు చేసిన ఆరోపణలు అవాస్తవమని మండల పార్టీ అధ్యక్షులు ప్రసాదరావు అన్నారు. ఎస్ కోటలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ. పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఇంచార్జ్ సత్యనారాయణ పనిచేస్తున్నారని, కూటమిలో భాగంగా మిత్ర ధర్మం పాటిస్తూనే పార్టీ కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటున్నారన్నారు. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి జనసైనికులు పని చేయాలని కోరారు.