జిందాల్ భూ నిర్వాసితులపై పెట్టిన బైండోవర్ కేసులు తొలగించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని సిపిఎం జిల్లా నాయకులు చల్లా జగన్ డిమాండ్ చేశారు. ఎస్. కోట మండలం బొడ్డవరలో భూ నిర్వాసితులతో ఆయన మంగళవారం సమావేశమై తమ నిరసన వ్యక్తం చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తున్న తమపై పోలీసులు ఆంక్షలు విధించడం తగదని మండిపడ్డారు. తక్షణమే జిందాల్ భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు