మధ్యవర్తిత్వం అనేది నిపుణుడి సహకారంతో ఇరు వర్గాల మధ్య వివాదాన్ని పరిష్కరించుకునే పద్ధతి అని ఎస్ కోట కోర్టు జడ్జి, మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ బి కనక లక్ష్మీ అన్నారు. ఎస్ కోట కోర్టు ఆవరణలో సోమవారం ఆమె మధ్యవర్తిత్వం - దేశం కోసం అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న సివిల్, చెక్ బౌన్స్, కుటుంబ, పరిష్కరించ దగ్గ క్రిమినల్ కేసులను మధ్య వర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చన్నారు.