ఎస్ కోట పట్టణంలో గ్రీన్ ఎర్త్ ఆర్గనైజేషన్ (జియో) ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో జియో వ్యవస్థాపకులు బి రామకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక జియో నర్సరీ నుండి అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 60 జంబో, నేరేడు తదితర పూల మొక్కలను ఉచితంగా అందజేశారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ కే భరత్ కుమార్ నాయక్ జియో సేవలను అభినందించారు. హృషికేశ్, లాస్య శ్రీ తదితరులు పాల్గొన్నారు.