ఎస్ కోట మండలంలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం

ఎస్ కోట మండలం తలారి, ఉసిరి, వినాయక పల్లి, సీతంపేట తదితర గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఇటీవల వర్షాభావ పరిస్థితులతో అల్లాడిపోయిన ప్రజానీకం వర్షానికి సేద తీరారు. కాగా ఇప్పటికే వేసిన వరి నారుకు ఈ వర్షం అనుకూలంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. వర్షం పడేటప్పుడు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్