ఎస్ కోట: భూ నిర్వాసితులపై బైండోవర్ కేసులు పెట్టడం సరికాదు

జిందాల్ భూ నిర్వాసితులపై బైండోవర్ కేసులు పెట్టడం పోలీసులకు సరికాదని సిపిఎం జిల్లా నాయకులు చల్లా జగన్ అన్నారు. ఎస్ కోట మండలం బొడ్డవరలో జిందాల్ భూ నిర్వాసితులతో ఆయన సోమవారం సమావేశమయ్యారు. నిర్వాసితులు తరపున పోరాడిన ఏ నాయకుడు ఇంతవరకు ఎటువంటి అశాంతి కలిగే కార్యక్రమాలు చేయలేదని అన్నారు. కంపెనీ కట్టలేని కారణంగా చట్ట ప్రకారం గిరిజనులకు భూమి అప్పగించి వారికి న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్