జిందాల్ భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా నాయకులు చల్లా జగన్ డిమాండ్ చేశారు. ఎస్ కోట మండలం బొడ్డవరలో ఆదివారం ఆయన జిందాల్ భూ నిర్వాసితులతో కలసి నిరసన వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులు 23 రోజులుగా న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ అధికార, ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే జిందాల్ అవకతవకలపై విచారణ చేపట్టి, భూ నిర్వాసిత గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు.