రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఎస్. కోట మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని లచ్చందొరపాలెం కు చెందిన కండిపల్లి సుదీర్ (18) తమ స్నేహితులతో కలిసి ఆటోలో వెళుతున్న నేపథ్యంలో నవోదయ స్కూల్ వద్ద ఎదురుగా వస్తున్న టాటా ఏసీ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుధీర్ అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ముగ్గురిని ఎస్. కోట పిహెచ్సికి తరలించి, మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయనగరం తరలించారు.