విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని అర్ధానపాలెం ఏపీ మోడల్ స్కూల్ నుంచి మంగళపాలెం వెళ్తున్న స్కూల్ ఆటో గురువారం బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురికి తీవ్రగాయాలు కాగా, మిగిలినవారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మద్యం మత్తులో డ్రైవర్ స్టంట్స్ చేయడంతో ప్రమాదం జరిగిందని విద్యార్థినులు చెబుతున్నారు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.