శృంగవరపుకోట మండలం ఖాసాపేటలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం, పట్టాభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి దంపతులతో కలిసి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేసి ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.