వేపాడ మండలంలో వారం రోజులుగా జరుగుతున్న పశుగ్రాస వారోత్సవాలు నేటితో ముగిసినట్లు పశు వైద్యాధికారిణి కే గాయత్రి తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని నల్లబిల్లిలో సోమవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. 25 మంది పాడి రైతులకు చెందిన 32 పశువులకు గర్భకోశ పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. పశుగ్రాసం పెంపకం వల్ల కలిగే లాభాలు, ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.