వేపాడ మండలంలో ఉచిత పశు వైద్య శిబిరం

వేపాడ మండలం చిన గుడిపాలలో పశు వైద్యాధికారిణి గాయత్రి ఆధ్వర్యంలో శనివారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో పశుగ్రాసం పెంచడం వల్ల కలిగే లాభాలు, ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం 22 మంది పాడి రైతులకు చెందిన పశువులకు ఉచితంగా గర్భకోస పరీక్షలు నిర్వహించారు. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పశువుల పెంపకం పై రైతులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

సంబంధిత పోస్ట్