ఏడాది పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి అన్నారు. వేపాడ మండలం బాణాదిలో శుక్రవారం జరిగిన సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న తీరును, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎస్సీ కాలనీలో ప్రజలు కాలనీలో నెలకొన్న కరెంటు సమస్యను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. సత్వర పరిష్కారానికి చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.