విజయనగరం జిల్లా వంగర మండలం బాగెంపేటలో నాలుగు రోజుల క్రితం శంకర్రావు ఇంట్లో చోరీ జరిగింది. 20 తులాల బంగారం అపహరణకు గురైంది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు సాగుతుండగా, ఓ వ్యక్తి ఫోన్ చేసి స్కూటీ డిక్కీలో బంగారం ఉందని చెప్పాడు. చూశాక బంగారం దొరికింది కానీ నల్లపూసల తాడు, ఉంగరం మాత్రం లేకపోయింది. కేసు విచారణ కొనసాగుతోంది.