వంగర: చోరీ ఘటనలో ముగ్గురు అరెస్ట్: ఎస్ఐ

వంగర మండలం భాగేంపేట గ్రామంలో జూలై 25న రాత్రి జరిగిన చోరీ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ షేక్ శంకర్ శుక్రవారం తెలిపారు. నిందితులు శ్రీరాం బాలరాజు (ఎరకరాయపురం), జాడ. దుర్గ ప్రసాద్ (T.K రాజపురం), రెడ్డి గోపాలకృష్ణ (భాగేంపేట) అని వెల్లడించారు. దొంగతనానికి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని తెలిపారు.

సంబంధిత పోస్ట్