ప్రభుత్వ మోసాలను ఎండగట్టండి.. బొత్స అప్పల నరసయ్య

దత్తిరాజేరు గ్రామంలో మండల వైసీపీ నాయకులు అనుబంధ గ్రామ కమిటీల ఏర్పాటుపై మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆధ్వర్యంలో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, ప్రభుత్వానికి భయపడి పత్రికలు, టీవీ ఛానళ్లు లోబడి పనిచేస్తున్నాయని, సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వం చేస్తున్న మోసాలను ఎండగట్టాలని పార్టీ నాయకులకు సూచించారు. ప్రతి గ్రామంలో అనుబంధ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్