ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

విజయనగరం జిల్లాలో సోమవారం అర్ధరాత్రి పూసపాటిరేగ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని అతివేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్