విజయనగరం జిల్లాలో 3 రోజుల వ్యవధిలో ఏడుగురి మృతి

విజయనగరం జిల్లాలో జాతీయ రహదారులపై పెరుగుతున్న ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల 26న భోగాపురం మండలం నారుపేట హైవేపై జరిగిన ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. 27న అర్ధరాత్రి పూసపాటిరేగ మండలం పేరాపురం హైవేపై నలుగురు మృతి చెందారు. తాజాగా బుధవారం భోగాపురం హైవేపై జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మితిమీరిన వేగం, భారీ వాహనాల నిలుపుదల ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి.

సంబంధిత పోస్ట్