ఎస్ఎఫ్ఐ ప్లీనరీ సమావేశంలో 12 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. విజయనగరం జిల్లా అధ్యక్షుడు డి. రాము, కార్యదర్శి వెంకటేశ్ ఆదివారం ప్రజా సంఘాల భవనంలో మాట్లాడారు. డిగ్రీ అడ్మిషన్లు ఆఫ్ లైన్ లో నిర్వహించాలని, ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజాం, గజపతినగరం, విజయనగరం డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. "తల్లికి వందనం" అన్ని అర్హులకు షరతుల్లేకుండా అమలుచేయాలని కోరారు.