విజయనగరం: పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి చర్యలు

పోలీసు సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పోలీసు సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. శుక్రవారం విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో "పోలీసు వెల్ఫేర్ డే" నిర్వహించారు. సిబ్బంది నుండి విజ్ఞాపనలు స్వీకరించారు. సిబ్బంది యొక్క వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు చర్యలు చేపడతానని ఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్