విజయనగరం నగర ప్రజలకు బుధవారం తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. ఈదురుగాలుల ప్రభావంతో ముసిడిపల్లి, నెల్లిమర్ల పంప్‌హౌస్‌లలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో నగరంలో నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు కమిషనర్ బాలస్వామి తెలిపారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అనంతరం నీటి పంపిణీ తిరిగి ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ప్రజలు ముందుగానే తాగునీటిని నిల్వ చేసుకుని అవసరానికి తగ్గట్టుగా వినియోగించాలని సూచించారు.