AP: లిక్కర్ స్కాం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు రమ్మంటూ సిట్ మరోసారి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఈ పరిణామం ప్రతిపక్షం వైసీపీని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ కేసులో కీలక నేతనే టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి వ్యవహారం ఆ పార్టీకి కలవరం పుట్టిస్తోంది. అలాగే VSR చంద్రబాబుకు మద్దతుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో VSR ఏం చెబుతారన్న టెన్షన్ కనిపిస్తోందని సమాచారం.