బీజేపీలోకి విజయసాయిరెడ్డి.. క్లారిటీ

AP: బీజేపీలోని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేరబోతున్నారని గత కొద్ది నెలలుగా ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పందించారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి బీజేపీలోకి చేరేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదని స్పష్టం చేశారు. ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పారని గుర్తు చేశారు. వైసీపీలో ఆయనకు అన్యాయం జరిగిందని చెప్పారని చెప్పారు. విజయసాయిరెడ్డి వస్తానంటే తాము చేర్చుకోవడానికి కూటమి పార్టీలతో చర్చించాల్సి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్