ఏపీ రాజకీయాల్లో మరో కొత్త పొలిటికల్ పార్టీ ఆవిర్భవించబోతోంది. బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ప్రజల పక్షాన బలమైన గొంతుక వినిపించేందుకు కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ నెలలోనే తన నూతన రాజకీయ ప్రయాణం ఉంటుందన్నారు. పార్టీ వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపారు. నూతన పార్టీకి స్వామివారి ఆశీస్సులు కోరినట్లు VSR పేర్కొన్నారు.