AP: విజయసాయిరెడ్డి ఏకకాలంలో మీడియా ఏర్పాటుతో పాటు కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. గెలుపు ఓటములను పక్కన పెడితే, ఆయన జగన్ మోహన్ రెడ్డిని తీవ్రంగా టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కోసం 16 నెలల జైలు జీవితం గడిపిన విజయసాయిరెడ్డి, వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డారు. అయితే, జగన్ వల్ల గౌరవభావం కోల్పోయి, కేసులను ఎదుర్కొని, అవమానాలు కూడా పడ్డారని తెలుస్తోంది. తన పతనానికి వైఎస్ జగన్ కారణమని భావిస్తూ, ఆయనను టార్గెట్ చేసుకుని కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.