మరోసారి ఈడీ ఎదుటకు విజయసాయిరెడ్డి

వైసీపీ మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి లిక్కర్ కేసులో మరోసారి ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కొద్ది రోజుల క్రితం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు, మనీ లాండరింగ్, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. మద్యం కంపెనీల నుంచి వసూలు చేసిన నిధులను రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లోకి ఎలా మళ్లించారనే దానిపై విచారణ జరుగుతోంది. తనకు ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేదని, విచారణకు సహకరిస్తానని సాయిరెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్